Telugu Updates
Logo
Natyam ad

ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఏఈ..!

నాగర్‌కర్నూల్: కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కరెంట్ స్తంభాల కోసం స్థిరాస్తి వ్యాపారి వద్ద ఏఈ సురేశ్ లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సుంకర ప్రభాకర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు సురేశ్‌కు ప్రభాకర్ రెడ్డి రూ. 1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం సురేశ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో చంద్రభాస్కర్‌, శ్రీనివాసులు ప్లాటినం, ప్రైమ్‌ అనే రెండు వెంచర్లలలో విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు, లైన్లు ఇతరత్రా పనుల కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రభాకర్‌ అనే కాంట్రాక్టర్‌ను సంప్రదించగా అతడు కల్వకుర్తి విద్యుత్‌ కార్యాలయంలో ఏఈ సురేశ్‌ని కలిశాడు. వెంచర్లలో 100 కేడబ్ల్యూ డీటీఆర్‌ కెపాసిటీ ట్రాన్స్‌ ఫార్మర్‌ అవసరం ఉండగా ఏఈ సురేశ్ రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. మరో మూడు వెంచర్ల నిర్వాహకులను ఇదే తరహాలో డబ్బులు డిమాండ్‌ చేశాడు. దీంతో ప్రభాకర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారులో ఏఈ సురేశ్‌కు ప్రభాకర్‌ రూ.లక్ష ఇవ్వగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈని విచారించిన అనంతరం హైదరాబాద్‌ స్పెషల్‌ కోర్టు (నాంపల్లి)లో శనివారం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ నర్సింహ, లింగస్వామి, సిబ్బంది ఉన్నారు.