ఆంజనేయులు న్యూస్: ఆధార్ కార్డు అవసరం గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడపడితే అక్కడ దీని ఫొటోకాపీ (జిరాక్స్)ని ప్రూఫ్ గా ఇచ్చేస్తున్నాం. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో కూడా ఆరా తీయడం లేదు. పని <span;>అయిపోయాక తిరిగి తీసుకుందామన్న అవగాహనా చాలా మందిలో ఉండడం లేదు. దీంతో ఆధార్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్, సిమ్.. ఇలా ప్రతిదానికీ మనం ఇప్పటికే ఆధార్ ను అనుసంధానించి ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆధార్ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ముప్పు తప్పదు. దీనిపై ప్రభుత్వం తాజాగా పౌరులను అప్రమత్తం చేసింది. అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్ నెంబరు ఉన్న కార్డు ఫొటో కాపీని ఇవ్వాలని సూచించింది. అవసరం లేని దగ్గర మాస్క్డ్ ఆధార్ కార్డుని ఇవ్వాలని కోరింది.
హోటల్స్, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్ ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది..