Telugu Updates
Logo
Natyam ad

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య..?

హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మెట్రో పిల్లర్ నంబర్ 96 వద్ద బుధవారం అర్ధరాత్రి ఘటన జరిగింది. నడిరోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని కత్తులతో నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడిని చాంద్రాయణగుట్టలోని షాహీన్ నగర్ కు చెందిన జహంగీర్(22) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పాతకక్షల కారణంగా హత్య జరిగిందా? మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, ఆసిఫ్నగర్ ఏసీపీ శివమారుతి పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.