జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భావితరాలకు ఆరోగ్యకరమైన, సమత్యుల వాతావరణాన్ని రూపొందించడంలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మియావాకి, మాసివ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఎన్.హెచ్.ఎ.ఐ.-పి.ఐ.యు. మంచిర్యాల ప్రాజెక్టు మేనేజర్ కె.ఎన్. అజయమణి కుమార్ తో కలిసి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఎన్.హెచ్.-363 రహదారికి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు విభాగం కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మొత్తం పొడవు 94.602 కిలోమీటర్లు అని తెలిపారు. మియావాకీ ప్రాజెక్టు పరిధిలో 10 వేల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఇదే తరహాలో ప్రతి ఒక్కరు వంతుగా మొక్కలు నాటి సంరక్షించి భావితరాలకు సహజ వాయువు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి.జి.ఎం. సతీష్, ఎన్.హెచ్.ఎ.ఐ.-పి.ఐ.యు., మంచిర్యాల సైట్ ఇంజనీర్ బి. సంతోష్, అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఓ&ఎం టీమ్ మేనేజర్ సునీల్ కేడువానీస్, వెంకటేశ్వర్లు, రేపల్లెవాడ హైవేస్ లిమిటెడ్ ఓ&ఎం మేనేజర్ రంజన్కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.