Telugu Updates
Logo
Natyam ad

24 గంటలు కరెంట్ ఉంటుందని ఊహించామా?: హరీశ్ రావు

మహబూబాబాద్: తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్, భాజపా కలిసి కుట్ర చేస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణకు నష్టం చేసే విపక్షాలు కావాలో.. మేలు చేసే తెరాస కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి.. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 32 పడకల పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 41 పడకల జనరల్ వార్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కరెంట్ కోతలతో దిల్లీ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటలూ కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఎప్పటికీ తెరాసే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లలో కాని పనులు ఈ 7 ఏళ్లలో అయ్యాయని చెప్పారు.

తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. పక్కనే ఆంధ్రప్రదేశ్ లో రోజూ 6 గంటల కరెంట్ కోత ఉందని చెప్పారు. అక్కడ మూడేసి గంటల చొప్పున ఉదయం, సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తున్నారని హరీశ్ రావు అన్నారు..