మంచిర్యాలలో పార్కింగ్‌కు స్థలం కరువు.. నిబంధనలకు తూట్లు!

మంచిర్యాల నవంబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలో పెద్దపెద్ద వాణిజ్య భవనాలు, ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్నప్పటికీ వాహనాల పార్కింగ్ సదుపాయాల కల్పనపై మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవనాలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు పార్కింగ్ ఏర్పాట్లను పట్టించుకోకపోవడంతో వినియోగదారులు, రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాంప్లెక్స్, గిన్ని కాంప్లెక్స్‌తో పాటు ఐబీ చౌరస్తాలోని ముఖరం ప్లాజా, వంటి పెద్ద వాణిజ్య భవనాల్లో సెల్లార్లను పార్కింగ్‌కు వినియోగించకుండా ఇతర వ్యాపారాలకు...