ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కదలని ట్రాఫిక్, మున్సిపల్ యంత్రాంగం!
ఆంజనేయప్రసాద్ హాస్పిటల్ గల్లీలో ట్రాఫిక్ ఇక్కట్లు.. అధికారుల నిర్లక్ష్యంపై కాలనీవాసుల ఆవేదన! మంచిర్యాల నవంబర్ 26, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని ఐబీ ఏరియా ఆంజనేయప్రసాద్ హాస్పిటల్ లైన్లో ట్రాఫిక్ సమస్య కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గత 40 ఏళ్లుగా నివసిస్తున్న సుమారు 200కు పైగా కుటుంబాలు మూడేళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఆంజనేయప్రసాద్, బర్త్ రూట్స్ ఆసుపత్రుల వద్ద రోడ్డుపైకి విస్తరించిన షట్టర్లు, షెడ్లతో పాటు రహదారిపైనే వాహనాల పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎదురెదురుగా...