డ్రగ్స్ దందా చేస్తే ఆస్తులు గల్లంతే.. సీపీ మహేష్ భగవత్ వార్నింగ్!
హైదరాబాద్ నవంబర్ 21, ( ఆంజనేయులు న్యూస్ ) హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని నగర నూతన పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయాలు, సరఫరా, స్మగ్లింగ్‌కు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం నిందితులను అరెస్టు చేయడమే కాకుండా, డ్రగ్స్ వ్యాపారంతో సంబంధం ఉన్న ఆస్తులను సైతం చట్టప్రకారం స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించే భవనాలను కూడా సీజ్ చేస్తామని వెల్లడించారు. నగరంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ స్నాచింగ్,...