క్యాతనపల్లిలో అధికారుల ‘రోడ్’ ఇష్టారాజ్యం!
డ్రైనేజీ పనుల తీరుపై కాలనీవాసుల అనుమానాలు.. అధికారుల నుంచి స్పష్టత కరువు. క్యాతనపల్లి, నవంబర్ 20, ( ఆంజనేయులు న్యూస్ ) క్యాతనపల్లి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల తీరుపై వివాదం నెలకొంది. 30 ఫీట్ల వెడల్పు కలిగిన రహదారిని 20 ఫీట్లకు కుదిస్తున్నారా? అనే అనుమానాలు కాలనీవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. రోడ్లను విస్తరించాల్సిన సమయంలో ఉన్న రహదారుల వెడల్పు తగ్గించే పరిస్థితి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఆనుకుని డ్రైనేజీ నిర్మాణం చేపడుతూ సుమారు ఐదు అడుగుల స్థలం విడిచిపెడుతున్నారని, దీనివల్ల...