కాసిపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బాలల సంబరాలు.. సర్పంచ్ వనజ

మంచిర్యాల, నవంబర్ 14, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముదాం వనజ–గోవర్ధన్, గ్రామపంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముదాం వనజ–గోవర్ధన్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్...