Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 11:06 pm Posted by : Anjaneyulu Dega

కాసిపేట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బాలల సంబరాలు.. సర్పంచ్ వనజ

మంచిర్యాల, నవంబర్ 14, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ముదాం వనజ–గోవర్ధన్, గ్రామపంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముదాం వనజ–గోవర్ధన్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు చదువులో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, తల్లిదండ్రులు సైతం పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

బాలల దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ ముదాం వనజ–గోవర్ధన్, కార్యదర్శి భీమయ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు.