కార్మెల్ కాన్వెంట్ CBSEలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మంచిర్యాల నవంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను...