Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 11:47 pm Posted by : Anjaneyulu Dega

కార్మెల్ కాన్వెంట్ CBSEలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మంచిర్యాల నవంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, కేరింతలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని అలవర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారు తమ లక్ష్యాలను చేరుకోగలరని తెలిపారు. విద్యార్థుల సంతోషం, వారి సమగ్ర అభివృద్ధే పాఠశాల లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపిన ప్రేమాభిమానాలు, వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనడంతో బాలల దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల సందడి.. శుభాకాంక్షలు తెలిపిన ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప.