నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ముఠా అరెస్ట్.!

తెలంగాణ, నవంబర్ 12, ( ఆంజనేయులు న్యూస్ ) నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల తయారీకి పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. టెలిగ్రామ్ లింకులు, నకిలీ వెబ్‌సైట్లను ఉపయోగించి అక్రమంగా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహమ్మద్ యాహ్యా, ఎండీ సలీం, పి.వెంకటేశ్ అనే ముగ్గురు నిందితులు గత ఏడాది కాలంగా ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు...