గురువు ప్రోత్సాహం.. విద్యార్థిని విజయానికి పునాది!

పూర్వ విద్యార్థిని శిరీషను సన్మానిస్తున్న ఉపాధ్యాయుడు దుర్గం శివానంద్. మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు వారిని గుర్తించి అభినందించడం గురువులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. తన వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించి, పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన పూర్వ విద్యార్థిని శిరీషను గుర్తించిన ఉపాధ్యాయుడు దుర్గం శివానంద్ ఆమెను ఘనంగా సన్మానించి తన అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా రూ.5 వేల నగదును ప్రోత్సాహకంగా అందజేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి...