ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యాన్ని విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలో బాలాజీ ట్రేడర్స్, రవీందర్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు...