పుష్కరాల పనులకు పక్కా అంచనాలు సిద్ధం చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్
పుష్కరాల పనులపై అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు చేపట్టాల్సిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులకు పక్కా అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీలోగా అన్ని శాఖల అధికారులు తమ ప్రతిపాదనలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి...