మంచిర్యాలలో టపాకాయల దుకాణాలపై భద్రతా ప్రశ్నలు!

బాణసంచా దుకాణాల ఏర్పాటు, భద్రతా నిబంధనల అమలుపై అనుమానాలు.. అధికారుల పర్యవేక్షణ ఏదంటూ ప్రజల ప్రశ్నలు! మంచిర్యాల, నవంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ ) దీపావళి పండుగ వేళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాణసంచా విక్రయాలు జోరందుకున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు అవుతుండగా, వాటి నిర్వహణలో భద్రతా నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల ప్రాణాల రక్షణ కోసం కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అనుమతుల పేరుతో అదనపు వసూళ్లు...