సాగునీరు బంద్‌తో చివరి ఆయకట్టు రైతుల ఆందోళన

సాగునీరు విడుదల చేయాలని తిమ్మాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు. మంచిర్యాల నవంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా కడెం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు ప్రకటన రావడంతో తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ పొలాల్లో పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ఈ కీలక సమయంలో నీరు నిలిపివేస్తే పంటలు ఎండిపోయి...