బస్సు డోర్ల మూసివేతపై TGSRTC కీలక ఆదేశాలు

తెలంగాణ నవంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ ) కదులుతున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల తలుపులు తప్పనిసరిగా మూసి ఉంచాలని TGSRTC కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కండక్టర్ గుండ్ల ప్రవళిక ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బస్సులు నడుస్తున్న సమయంలో డోర్లు తెరిచి ఉంచకూడదని, అన్ని బస్సుల్లో తలుపుల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం డిపో మేనేజర్లకు ఆదేశాలు...