మంచిర్యాల, నవంబర్ 4, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న రీ సర్వే పనులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండలంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే ప్రక్రియలో నిర్దేశించిన పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. మందమర్రి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, కార్యాలయ పనులపై సమీక్ష నిర్వహించారు. జి.ఓ. ఎం.ఎస్. నం. 76, 59, 58 క్రింద చేపడుతున్న భూముల క్రమబద్ధీకరణ పనుల పురోగతి, ఎస్‌ఐఆర్ ప్రక్రియని పరిశీలించి వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులు, మీ-సేవ ద్వారా జారీ చేయవలసిన పెండింగ్ ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దరఖాస్తుదారులకు నిర్ణీత సమయంలోగా జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సతీష్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.