Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 1:42 pm Posted by : Anjaneyulu Dega

జిల్లా సైన్స్ కాంగ్రెస్‌లో కార్మెల్ విద్యార్థినుల సత్తా!

87 పాఠశాలల పోటీలో అగ్రస్థానం.. రాష్ట్రస్థాయికి దీక్షిత, సహస్ర ఎంపిక

మంచిర్యాల, సెప్టెంబర్ 3, ( ఆంజనేయులు న్యూస్ )

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ (సీబీఎస్‌ఈ) విద్యార్థినులు టి. దీక్షిత, ఎ. సహస్ర విశేష ప్రతిభ కనబరిచారు. నవంబర్ 2న మంచిర్యాల జిల్లా సైన్స్ కార్యాలయ కేంద్రంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 87 పాఠశాలలు పాల్గొనగా, కార్మెల్ విద్యార్థినులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ‘అవేర్ మైండ్స్’ అనే థీమ్‌తో రూపొందించి ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టు న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకుంది. జిల్లా స్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 87 పాఠశాలల నుంచి వచ్చిన పోటీలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి అర్హత సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ కృప, కౌన్సిలర్ సిస్టర్ అనుపతో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థినులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


• ప్రకటన •


శ్రీ నందిని నృత్యాలయం కూచిపూడి శాస్త్రీయ నృత్య శిక్షణ


మీ వ్యాపార, సంస్థల ప్రకటనల ప్రచురణ కోసం “ఆంజనేయులు న్యూస్‌” ను సంప్రదించండి.