Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 10:24 pm Posted by : Anjaneyulu Dega

ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి జి. రమేష్

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వ్యవసాయ అధికారి జి. రమేష్.

సంగారెడ్డి, సెప్టెంబర్ 3, ( ఆంజనేయులు న్యూస్ )

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎరువుల వ్యాపారాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు ఫిర్యాదుదారుడి అల్లుడి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా అక్టోబర్ 19న ఇప్పటికే రూ.10 వేలు తీసుకున్న అధికారి, మిగిలిన రూ.20 వేలను నవంబర్ 3న తన కార్యాలయంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ చర్య చేపట్టి, ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి.!
ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.


• ప్రకటన •



ప్రకటనల ప్రచురణ కోసం “ఆంజనేయులు న్యూస్‌” ను సంప్రదించండి.