Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 8:40 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాలలో నేరాల నియంత్రణకు కొత్త ఐపీఎస్ అధికారి నియమించాలి

మంచిర్యాల, సెప్టెంబర్ 2, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాలలో ఇటీవల చోటుచేసుకుంటున్న దాడులు, గొడవలు, నేరాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కొత్త ఐపీఎస్ అధికారిని నియమించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్పీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డీజీపీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాలలో పెరుగుతున్న నేరాలను నియంత్రించి, ప్రజలకు భద్రత కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.