రైలు కిందపడి యువతి మృతి.!

జనగామ, నవంబర్ 1, ( ఆంజనేయులు న్యూస్ ) జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి 24 ఏళ్ల యువతి మృతి చెందింది. కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి చెందిన కుంటి శ్రావణి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్య సమస్యలతో పాటు, తన వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.