చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.. భారీ దోపిడీ!

60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.. కారుతో పరారైన దుండగులు యాదాద్రి భువనగిరి, నవంబర్ 1 ( ఆంజనేయులు న్యూస్ ) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదును దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా సుధాకర్‌కు చెందిన కారును సైతం అపహరించుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్...