క్షయ రహిత జిల్లానే లక్ష్యం: కలెక్టర్ కె.హరిత

మంచిర్యాల, అక్టోబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ ) జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత పిలుపునిచ్చారు. క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతో పాటు పోషకాహారం తీసుకుంటే వ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. గురువారం కెరమెరి మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య పరీక్షల...