మంచిర్యాల, దండేపల్లి ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం: సీపీ అంబర్ కిషోర్ ఝా
సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ కాని, అసత్య సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించిన సీపీ. రామగుండం అక్టోబర్ 30, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలనే ఉద్దేశంతో సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ఈ బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం...