ఎన్‌హెచ్‌-63 భూసేకరణపై రైతుల ఆగ్రహం

గ్రామసభలు నిర్వహించకుండానే అవార్డుల అమలుపై ఆందోళన.. ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయం ఎదుట ధర్నా మంచిర్యాల అక్టోబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ ) నేషనల్ హైవే-63 భూసేకరణ వ్యవహారంలో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామసభలు నిర్వహించకుండా అవార్డులు అమలు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ పీడీ అజయ్ మణికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా...