మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోవాలి
మంచిర్యాలలో నషాముక్తి భారత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య మంచిర్యాల, అక్టోబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ ) మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,...