తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరకే నిత్యావసరాలు
తెలంగాణ అక్టోబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ ) ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా నిత్యావసర ధరలు పెరుగుతుండటంతో, సామాన్యులపై భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, పంచదార వంటి సరుకులను అతి తక్కువ ధరకే అందించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశమై 14 నెలలకు సరిపడా సరుకుల సేకరణపై చర్చించారు. ప్రజలకు ధరల భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ...