మంచిర్యాల బస్టాండ్‌లో చెత్త దహనం.. ప్రయాణికుల ఆరోగ్యానికి ముప్పు!

మంచిర్యాల బస్టాండ్‌లో సులభ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో చెత్త దహనంతో ప్రయాణికులకు ఇబ్బందులు! మంచిర్యాల, అక్టోబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ ) ప్రయాణికుల నిత్య రాకపోకలతో రద్దీగా ఉండే మంచిర్యాల బస్టాండ్‌లో అపరిశుభ్రత సమస్య ఆందోళన కలిగిస్తోంది. సులభ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో పాటు, వ్యర్థాలను కాల్చడం వల్ల దుర్వాసన, పొగ వ్యాపిస్తున్నాయి. దీంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ పరిస్థితిపై అధికారులు తక్షణమే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్టాండ్‌ పరిసరాల్లో...