మంచిర్యాలలో అభివృద్ధి పనులా.. వ్యాపారుల పాలిట శాపాలా?

మంచిర్యాల మార్కెట్‌లో అసంపూర్తి పనులతో వ్యాపారులకు తిప్పలు.! మంచిర్యాల, అక్టోబర్ 26, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల మార్కెట్‌ ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు వెడల్పు, డ్రైనేజీ పనులు వ్యాపారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అభివృద్ధి పనులను ఎవరూ వ్యతిరేకించడం లేదు.. కానీ పనుల పేరుతో దుకాణాల ముందు తవ్వకాలు జరిపి రోజుల తరబడి అసంపూర్తిగా వదిలేస్తే తమ వ్యాపారాలు ఎలా సాగించాలని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. పనుల్లో జాప్యం కారణంగా వినియోగదారులు దుకాణాల వద్దకు రావడం తగ్గి, రోజువారీ ఆదాయం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం...