Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 7:15 pm Posted by : Anjaneyulu Dega

మంత్రి శ్రీధర్ బాబుకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

హైదరాబాద్, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )

హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శుక్రవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోడూరి విజయ్, నాయకులు అంజి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.