మంచిర్యాల కాంగ్రెస్లో కుంపట్లు.. ప్రజలకు తిప్పలు!
వర్గపోరుతో ఉద్రిక్తతలు.. పోలీసులకు అదనపు భారం మంచిర్యాల అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అధికార పార్టీలోని నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిరంగ చర్చకు దారితీయడంతో పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు నాయకులకే పరిమితం కాకుండా ఘర్షణలకు దారితీస్తే సాధారణ జనజీవనంపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ...