డిగ్రీలు పెరిగాయ్.. కొలువులేవీ!
ఉన్నత విద్యావంతుల్లోనూ తీవ్ర నిరుద్యోగం.. యువత భవిష్యత్తుపై ప్రశ్నలు తెలంగాణ అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ప్రత్యేక కథనం ) దేశంలో డిగ్రీలు పెరుగుతున్నా యువతకు తగిన ఉద్యోగాలు మాత్రం లభించడం లేదు. చేతిలో పట్టాలు ఉన్నా కొలువులు దక్కక లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు రంగంలోనూ విద్యార్హతలకు తగిన ఉపాధి లభించకపోవడంతో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యువతే దేశ బలమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వారికి నాణ్యమైన ఉపాధి కల్పించడంలో ఆశించిన...