విద్యార్థుల భద్రతకు ‘యాంటీ సూసైడ్ ఫ్యాన్లు’!

తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి తెలంగాణ అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) కీలక చర్య చేపట్టింది. యూనివర్సిటీ హాస్టళ్లలో 354 స్ప్రింగ్‌ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక ఫ్యాన్లపై 10 కిలోలకుపైగా బరువు పడితే అవి కిందకు వేలాడుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా రూపొందించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా తీసుకున్న ఈ చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు....