ప్రభుత్వ పాఠశాలకు బెంచీలు కల్పించాలని మంత్రికి సర్పంచ్ వినతి

తాండూర్ అక్టోబర్ 18, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం కాసిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు విశాఖ ట్రస్ట్ తరఫున బెంచీలు పంపిణీ చేయాలని గ్రామ సర్పంచ్ ముదాం వనజా గోవర్ధన్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, పాఠశాలకు బెంచీలు అందించేలా చర్యలు తీసుకోవాలని...