జర్నలిస్టుల రక్షణకు జాతీయ చట్టం తేవాలి: సోమ సుందర్

మంచిర్యాలలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి సోమ సుందర్‌ను సన్మానిస్తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు మంచిర్యాల అక్టోబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ ) జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ సోమ సుందర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఐజేయూ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో...