విధుల్లోనే గుండెపోటుతో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి
మూడు నెలలుగా జీతాల్లేవు.. అనారోగ్యంతోనూ విధులకు హాజరు ఎర్వచింతల్ గ్రామంలో విషాదం.. కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి ఖానాపూర్, అక్టోబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ ) గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడి మృతితో ఎర్వచింతల్ గ్రామంలో విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు చిట్యాల రాజన్న (57) సోమవారం విధుల్లో ఉండగా తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందాడు. సుమారు 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీలో సేవలందిస్తున్న రాజన్న పారిశుధ్య పనులు చేస్తుండగా ఒక్కసారిగా...