రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

రంగారెడ్డి అక్టోబర్ 12, ( ఆంజనేయులు న్యూస్ ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. భూమికి సంబంధించిన అధికారిక పనిని పూర్తి చేసేందుకు ఫిర్యాదుదారుడి నుంచి ఇద్దరు అధికారులు కలిసి రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఏసీబీ సిటీ రేంజ్–సీఐయూ అధికారులు దాడి చేసి, లంచం సొమ్ము తీసుకుంటున్న...