మంచిర్యాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా.. ఫ్రీ లెఫ్ట్‌కు దారి ఏదీ?

సూచిక బోర్డులు లేక వాహనదారుల అవస్థలు.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై అసహనం మంచిర్యాల అక్టోబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేసినా వాహనదారుల ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్ మార్గంలో వెళ్లే వాహనదారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎడమవైపు వెళ్లాల్సిన మార్గంలోనే వాహనదారులు నిలిచిపోతుండటంతో ఫ్రీ లెఫ్ట్ ద్వారా వెళ్లాలనుకునే వారికి దారి లేకుండా పోతోంది. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు....