గ్రీన్ సిటీ డంపింగ్ యార్డ్ తరలింపునకు ప్రత్యామ్నాయ స్థలం పరిశీలన
ప్రజావాణిలో కలెక్టర్‌కు కాలనీవాసుల ఫిర్యాదు మంచిర్యాల అక్టోబర్ 12, ఆంజనేయులు న్యూస్ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీ అండాలమ్మ కాలనీ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను తరలించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు అందించారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, అక్కడ అందుబాటులో ఉన్న అడిషనల్ మున్సిపల్ కమిషనర్‌ను పిలిపించి డంపింగ్ యార్డ్ తరలింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డంపింగ్ యార్డ్ తరలింపునకు సంబంధించి అధికారులు చేపడుతున్న చర్యలను అడిషనల్ మున్సిపల్ కమిషనర్ రాజు కాలనీవాసులకు...