కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మంచిర్యాల అక్టోబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ – CBSEలో బతుకమ్మ పండుగ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ రినెట్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ప్రకృతిపై...