వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో 60 నెలలుగా అమావాస్య అన్నదానం
మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) నిరుపేదలకు అన్నదానం చేయాలనే సంకల్పంతో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం 60 నెలలు పూర్తి చేసుకుంది. ఐదేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 2021లో మంచిర్యాల ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వాహకుడు పడకంటి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రారంభమైన అమావాస్య అన్నదాన కార్యక్రమాలు, 2022 నుంచి మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రతి...