Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 3:05 pm Posted by : Anjaneyulu Dega

వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో 60 నెలలుగా అమావాస్య అన్నదానం

మంచిర్యాల అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

నిరుపేదలకు అన్నదానం చేయాలనే సంకల్పంతో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం 60 నెలలు పూర్తి చేసుకుంది. ఐదేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. 2021లో మంచిర్యాల ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వాహకుడు పడకంటి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రారంభమైన అమావాస్య అన్నదాన కార్యక్రమాలు, 2022 నుంచి మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి దాతలు గుండ రాజేశ్, గంప కుమారస్వామి, బొమ్మకంటి ప్రభాకర్ సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు సిరిపురం రాజేశ్, ముక్తా శ్రీనివాస్, గవర్నర్ పుల్లూరి బాలమోహన్ మాట్లాడుతూ ఐదేళ్లుగా అమావాస్య అన్నదాన కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. దాతలు అందిస్తున్న సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండే వాసవి క్లబ్స్ స్వచ్ఛంద సంస్థ నిరుపేదలకు, పేద వైశ్యులకు అండగా నిలుస్తోందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలతోపాటు వాసవి క్లబ్స్ ప్రతినిధులను నిర్వాహకుడు పడకంటి శ్రీనివాస్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ క్యాబినెట్ సెక్రటరీ సేవ కేశెట్టి వంశీకృష్ణ, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు మాదంశెట్టి సత్యనారాయణ, చిలువేరు వైకుంఠం, చిలువేరు శ్రీనివాస్, వాసవి క్లబ్ నాయకులు రాచర్ల చంద్రశేఖర్, నల్మాస్ ప్రవీణ్, వెలిశెట్టి రాఘవేంద్ర, పడకంటి రజిత, గుండా మనోహర్, బండ శ్రీనివాస్, తోట రాజయ్య, చందూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.