డంపింగ్‌ యార్డ్‌ తరలింపు హామీ ఏమైంది?

దుర్వాసన, పొగతో గ్రీన్‌ సిటీ, అండాలమ్మ కాలనీవాసుల అవస్థలు మంచిర్యాల అక్టోబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గ్రీన్‌ సిటీ, అండాలమ్మ కాలనీ సమీపంలోని డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ కమిషనర్‌ స్వయంగా డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించి, దానిని తరలిస్తామని హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు గుర్తుచేస్తున్నారు. అయితే ఆ సందర్శన జరిగి కొంతకాలం గడిచినా, తరలింపు ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం...