Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 7:49 pm Posted by : Anjaneyulu Dega

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు”

మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల తీవ్ర ఖండన

మంచిర్యాల, అక్టోబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, మాజీ కౌన్సిలర్ సంజీవ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జలీల్, 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అర్కాల హేమలత మాట్లాడారు. మాజీ చైర్మన్ ఉప్పలయ్యపై జలీల్ పలు ఆరోపణలు చేశారు. గతంలో పేదల కోసం కేటాయించిన 210 ప్లాట్ల వ్యవహారంలో ఒక్కో ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనిపై ఉప్పలయ్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలు, వసూళ్లు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై రాజకీయ స్వార్థంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. సురిమిల్ల వేణు, సంజీవ్‌లకు రాజకీయంగా అవకాశం కల్పించింది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావేనని పేర్కొన్నారు. కొత్త రాజకీయ కుంపటి పెట్టి గందరగోళం సృష్టించాలని చూస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.