రాళ్లవాగు వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం

మంచిర్యాల అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణ పరిధిలోని రాళ్లవాగు గోదావరిలో కలిసే ప్రాంతం వద్ద మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. నలుపు రంగు షార్ట్, బ్లూ కలర్ టీషర్ట్ ధరించి ఉన్నాడు. టీషర్ట్‌పై ‘నందన్ పైప్స్’ అని రాసి ఉంది. చేతికి నల్లటి రబ్బర్ బ్యాండ్, ఎర్రటి దండ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం నీటిలో బోర్లా పడి ఉన్నట్లు...