బీఆర్ఎస్‌కు షాక్.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రాజీనామా!
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో అవమానమే కారణమా? రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన భద్రాద్రి అక్టోబర్ 6, ( ఆంజనేయులు న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశంలో తనను వేదికపైకి ఆహ్వానించకపోవడంపై తాటి వెంకటేశ్వర్లు...